అమెరికాను కమ్మేస్తున్న కార్చిచ్చు

అమెరికాను కమ్మేస్తున్న కార్చిచ్చు

10-08-2018

అమెరికాను కమ్మేస్తున్న కార్చిచ్చు

కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అమెరికాను పొగతో కమ్మేస్తోంది. గత వారం రోజులుగా సుమారు 1,87,000 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వసం చేసినట్లు అమెరికా జాతీయ అగ్రిమాపక సంస్థ తెలిపింది. మెండోసినో కాంప్లెక్స్‌ ఫైర్‌ గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల మంటలు అంటుకున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్‌వాన్‌ ప్రావిన్స్‌లు కూడా అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.