ఆ దేశం మాతో వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటున్నది : ట్రంప్

ఆ దేశం మాతో వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటున్నది : ట్రంప్

11-09-2018

ఆ దేశం మాతో వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటున్నది : ట్రంప్

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్‌ కోరుకుంటున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో తన ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తున్నప్పటికీ ఒప్పందం చేసుకోవాలని భారత్‌ ఆకాంక్షిస్తున్నదని తెలిపారు. దక్షిణ డకోటాలో తన మద్దతుదారులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేన మీకు నిజం చెప్తున్నాను. మొట్టమొదటిసారి ఓ వాణిజ్య ఒప్పందాన్ని ప్రారంభిద్దామని భారత్‌ ఇటీవల మమ్మల్ని కోరింది అని చెప్పిన ఆయన ఇదంతా తమ ప్రభుత్వ ఘనతేనని తెలిపారు.