అమెరికాలో పిఎల్ఓ కార్యాలయం మూసివేత!

అమెరికాలో పిఎల్ఓ కార్యాలయం మూసివేత!

11-09-2018

అమెరికాలో పిఎల్ఓ కార్యాలయం మూసివేత!

పాలస్తీనా మిషన్‌కు ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్‌ఓ) కార్యాలయాన్ని మూసివేయాలని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అమెరికాలో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పిఎల్‌ఓ కార్యాలయం మూసివేత నిర్ణయాన్ని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్‌ బోల్టన్‌ ప్రకటిస్తారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష, అర్థవంతమైన చర్చలు ప్రారంభించడానికి పాలస్తీనీయులు తిరస్కరిస్తే లిబిరేషన్‌ ఆర్గనైజేషన్‌ను ట్రంప్‌ ప్రభుత్వం అనుమతించదు అని వాల్‌ స్ట్రీట్‌ పత్రిక తెలిపింది.