23న అమెరికాకు సీఎం చంద్రబాబు

23న అమెరికాకు సీఎం చంద్రబాబు

11-09-2018

23న అమెరికాకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు చంద్రబాబు అమెరికా పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే వివిధ వ్యాపారవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ నెల 27న అమెరికా పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగి రానున్నారు.