భారత సంతతికి చెందిన విద్యార్థిని రాజలక్ష్మి నందకుమార్ 2018 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మకమైన మార్కొని సొసైటీ పాల్ బరన్ యంగ్ స్కాలర్ అవార్డుకు ఎంపికయ్యారు. స్మార్ట్ఫోన్లను వినియోగించి ప్రాణాంతక రోగాలను సమర్థవంతంగా తెలుసుకునేందుకు దోహదం చేసినందుకు ఆమె చేసిన కృషికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన నందకుమార్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ అవార్డు కింద ఆమెకు 5 వేల డాలర్లు నగదు అందజేస్తారు.