షికాగోలో రాష్ట్రపతి ప్రసంగం

షికాగోలో రాష్ట్రపతి ప్రసంగం

13-09-2018

షికాగోలో రాష్ట్రపతి ప్రసంగం

స్వామి వివేకానంద చారిత్రక షికాగో ప్రసంగంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో భారత్‌ అగ్రగామిగా నిలిచిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. షికాగో ప్రసంగం 125 ఏళ్లు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని రామకృష్ణ మిషన్‌ ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది మతాలకు చెందిన ప్రవక్తలు, మతాధిపతులు, ఆధ్యాత్మిక విద్యార్థులు పాల్గొన్నట్లు మిషన్‌ కార్యదర్శి స్వామి శాంతత్మానంద తెలిపారు.