ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటు!

ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటు!

17-09-2018

ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటు!

విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్నారైల)కు కూడా భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఓటు హక్కు కల్పించింది. కానీ, దీనిపై ప్రచారం, అవగాహన కొరవడటంతో వారంతా ఓటరుగా నమోదు కావడం లేదు. ఇప్పటికే స్వస్థలంలో ఓటు హక్కు కలిగి ఉన్నా కూడా విదేశాల్లో ఉన్నందున, ఓటును బదిలీ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. దీంతో లక్షలాది మంది విదేశాల్లో ఉంటున్న కారణంగానే స్వదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రవాస భారతీయులు ఓటు హక్కును పొందడం లేదని చెప్పడానికి ఇప్పటివరకు నమోదైన ఓటర్లే నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య సింగిల్‌ నెంబర్‌ డిజిట్‌లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నారైలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో విదేశాల్లో ఉండి, ఓటర్లుగా నమోదైనవారు కేవలం నలుగురే ఉన్నారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.