టైమ్ మ్యాగజైన్‌ ను రూ.1378 కోట్లకు అమ్మేశారు

టైమ్ మ్యాగజైన్‌ ను రూ.1378 కోట్లకు అమ్మేశారు

17-09-2018

టైమ్ మ్యాగజైన్‌ ను రూ.1378 కోట్లకు అమ్మేశారు

అమెరికాకు చెందిన ప్రముఖ వార్త పత్రిక టైమ్‌ మ్యాగజైన్‌ అమ్మేశారు. మెరెడిత్‌ కార్పొరేషన్‌కు చెందిన ఈ మ్యాగజైన్‌కు 190 మిలియన్‌ డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ.1378.92 కోట్లు) విక్రయించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ బెనియాఫ్‌ దంపతులు టైమ్‌ మ్యాగజైన్‌ను కొనుగోలు చేశారు. అయితే మార్క్‌ బెనియాఫ్‌ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, మ్యాగజైన్‌ రోజువారీ కార్యకలాపాల్లో బెనియాఫ్‌ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.