న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ బహిరంగసభ

న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ బహిరంగసభ

20-09-2018

న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ బహిరంగసభ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన నేపథ్యంలో ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. నెవార్క్‌ నగరంలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ఈ నెల 23న సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ సీఎం రమేశ్‌, తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన, బుచ్చి రాంప్రసాద్‌, మోహన్‌కృష్ణ మన్నవ, జైతాళ్లూరి, రవి పొట్లూరి, బ్రహ్మాజీ వలివేటి తదితరులు పరిశీలించారు. నాలుగేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సభలో 2019 ఎన్నికల్లో ఎన్నారై టీడీపీ భాగస్వామ్యంపైనా టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారని వారు తెలిపారు.