పోలవరం ఆయన కల - మోహనకృష్ణ మన్నవ

పోలవరం ఆయన కల - మోహనకృష్ణ మన్నవ

24-09-2018

పోలవరం ఆయన కల - మోహనకృష్ణ మన్నవ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నడుంబిగించారని, ఎవరూ అడ్డుపడినా, ఇబ్బందులు సృష్టించినా తాను అనుకున్నట్లు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయన అపరభగీరథుడిలా కృషి చేస్తున్నారని నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మోహన్‌ కృష్ణ మన్నవ అన్నారు. న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశంలో మోహన్‌ కృష్ణ మన్న మాట్లాడుతూ, ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఎన్టీఆర్‌ క్యాంటీన్‌లు, బీమా పథకం ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.