ఎపిని మించిన ఉత్సాహం కనిపిస్తోంది...సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎపిని మించిన ఉత్సాహం కనిపిస్తోంది...సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

24-09-2018

ఎపిని మించిన ఉత్సాహం కనిపిస్తోంది...సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి నెవార్క్‌లో జరిగిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశంలో మాట్లాడుతూ, ఇక్కడివాళ్ల ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో ఉన్నామా, అమరావతిలో ఉన్నామా అనిపిస్తోంది. ఏపిని మించిన ఉత్సాహం అమెరికాలో పరవళ్లు తొక్కుతోంది. పసుపు చొక్కాలు, పసుపు కండువాలు,పసుపు జెండాలతో అమెరికాను పసుపుమయం చేశారు. ఎన్టీఆర్‌ తో, చంద్రబాబుతోనే కాదు, లోకేష్‌ తో కూడా సహచర మంత్రిగా 3 జనరేషన్లలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ప్రకతి సేద్యంలో ఏపి నెంబర్‌ వన్‌..ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో వరుసగా మూడేళ్లుగా అగ్రగామి. నదుల అనుసందానంలో మార్గదర్శకం. గ్రామీణాభివ ద్ధి, ఇంధన శాఖ,జలవనరుల రంగాలలో అనేక అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ దక్కించుకుంది. ఇంతగా అభివృద్ధి చెందుతున్నా ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రం?ఇది కనిపించడం లేదని విమర్శించారు.