చంద్రబాబుతో యూఎన్ భారత్ శాశ్వత ప్రతినిధి భేటీ

చంద్రబాబుతో యూఎన్ భారత్ శాశ్వత ప్రతినిధి భేటీ

24-09-2018

చంద్రబాబుతో యూఎన్ భారత్ శాశ్వత ప్రతినిధి భేటీ

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. ముఖ్యమంత్రితో ఆయన మధ్యాహ్న విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించారు. 60 లక్షల మంది రైతులను కనీసం 80 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేసేలా చర్యలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, చురుకైన నాయకత్వం ఏపీని ఆదర్శ, స్ఫూర్తిమంతమైన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాయని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఇరువురూ కలిసి నూతన వ్యవసాయ విధానాలు, రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాల గురించి కాసేపు చర్చించారు.