ఐరాస వేదికపై తెలుగులో ప్రసంగించిన చంద్రబాబు

ఐరాస వేదికపై తెలుగులో ప్రసంగించిన చంద్రబాబు

24-09-2018

ఐరాస వేదికపై తెలుగులో ప్రసంగించిన చంద్రబాబు

న్యూయార్క్‌లోని ఐరాస వేదికపై ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుత తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన తెలుగు పలుకులకు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు...ఆంధ్రప్రదేశ్‌ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికే ఆదర్శం అని తన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.