ఎన్నారై టీడిపి కార్యకర్తలను పలకరించిన చంద్రబాబు

ఎన్నారై టీడిపి కార్యకర్తలను పలకరించిన చంద్రబాబు

25-09-2018

ఎన్నారై టీడిపి కార్యకర్తలను పలకరించిన చంద్రబాబు

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వేదికపై నుంచి ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు ఎన్నారై టీడిపి ప్రతినిధులు కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎన్నారై టీడిపి తరపున చేస్తున్న కార్యాచరణను ఈ సందర్భంగా వారు వివరించారు. జయరామ్‌ కోమటి, వెంకట్‌ కోగంటి, పైలా ప్రసాదరావు, రవి పొట్లూరి, సతీష్‌ వేమన, రామ్‌ చౌదరి ఉప్పుటూరి తదితరులు ఆయనను కలుసుకున్న వారిలో ఉన్నారు.