ఎపిఇడిబితో ఒప్పందం కుదుర్చుకున్న న్యూజెర్సి కంపెనీ

ఎపిఇడిబితో ఒప్పందం కుదుర్చుకున్న న్యూజెర్సి కంపెనీ

25-09-2018

ఎపిఇడిబితో ఒప్పందం కుదుర్చుకున్న న్యూజెర్సి కంపెనీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో దాదాపు 100 మిలియన్‌ డాలర్లతో (727 కోట్ల రూపాయలు) బ్యాటరీ ఉత్పాదక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు న్యూజెర్సిలోని ట్రిటన్‌ సోలార్‌ ఎనర్జీ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ సిఇఓ, ఫౌండర్‌ డైరెక్టర్‌ హిమాంశు పటేల్‌, ఎపిఇడిబితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎపి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సికి వచ్చిన ఎపిఇడిబి సిఇఓ కృష్ణకిశోర్‌, ఐటీ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటితో ఎంఓయును ట్రిటన్‌ కంపెనీ కుదర్చుకుంది. ఈ కార్యక్రమంలో హరి ఇప్పనపల్లి, నంద కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హిమాంశు పటేల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. హరి ఇప్పనపల్లి మాట్లాడుతూ, త్వరలోనే తాము ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలను చూస్తామని చెప్పారు.