వినూత్న ఆవిష్కరణలకు ఎపి వేదిక

వినూత్న ఆవిష్కరణలకు ఎపి వేదిక

25-09-2018

వినూత్న ఆవిష్కరణలకు ఎపి వేదిక

 ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రానున్న కాలంలో వినూత్న ఆవిష్కరణలకు వేదిక కానున్నదని, నాలుగో పారిశ్రామిక విప్లవ పథంలో ముందుండటమే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి 'శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన' అనే అంశంపై సంయుక్త పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని, సరైన భాగస్వామ్యాలతో విజయాలను అందుకునే స్థానంలో తామున్నామని, స్థిర ఉత్పాదకత కోసం టెక్నాలజీల అమలుతో ఈ భాగస్వామ్య విజయాలు చిరకాలం కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్వస్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు జరిగే వ్యాపారంలో ఇటువంటి భాగస్వామ్యం నాలుగో పారిశ్రామిక విప్లవం మరింతగా విజయవంతం కావడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 4.0 సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్‌ కొనసాగిస్తుందని, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం లాంటి వేదికల ద్వారా అంతర్జాతీయస్థాయి మేలిమి పద్ధతులను పంచుకుని, అనుసరిస్తామని, అన్వయించుకుంటామని చంద్రబాబు తెలిపారు.

డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని చట్టబద్ధంగా బదలాయింపులో, లావాదేవీలలో ముఖ్యపాత్ర వహించే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, మనుషులకు పని ఒత్తిడి తగ్గించి, వేగంగా, సజనాత్మకతతో పనిచేయడానికి రోబోల సేవలతో కూడిన కొబాటిక్స్‌ టెక్నాలజీతో రానున్న కాలంలో కొత్తతరహా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి, కార్యాలయాలు, కార్యస్థానాలను రీడిజైన్‌ చేయడం అనివార్యమన్నారు. 

ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌ కి, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వాహక బందానికి మధ్య జరిగిన చర్చల సందఠంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లోకేశ్‌ చైనా పర్యటన, రాష్ట్రంలో త్వరలో నెలకొల్పనున్న సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ లో భాగస్వామ్యం తదితర అంశాలను ఉదహరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు యనమల రామకష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ సాలడుగు వెంకటేశ్వర్‌ తదితరులు ఉన్నారు.