డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

16-10-2018

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

డల్లాస్‌లో తెలుగు పీపుల్స్‌ అసోసియేషన్‌ (టీపాడ్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్‌ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్‌, ఆర్కాన్సాస్‌ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.  టీపాడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. టీపాడ్‌ ప్రెసిడెంట్‌ శ్రీని గంగాధర, బోట్‌ చైర్మన్‌ శారదా సింగిరెడ్డి, బోట్‌  ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ రఘువీర్‌ బండారులు బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికి కతజ్ఞతలు తెలిపారు.