తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

16-10-2018

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

గ్రేటర్‌ టొరంటోలో తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. లింకన్‌ అలెగ్జాండర్‌ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు.

 తెలంగాణ కెనడా అసోసియేషన్‌ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా రమేశ్‌ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా విజయకుమార్‌ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీనివాస్‌ మన్నెం, సాంస్క తిక కార్యదర్శిగా దీప గజవాడ, కోషాధికారిగా దామోదర్‌ రెడ్డి మాది, డైరక్టర్లుగా మనోహర్‌ భొగా, శ్రీనివాస్‌ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్‌ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా హరి రావుల్‌, ట్రస్టీలుగా సురేశ్‌ కైరోజు, వేణుగోపాల్‌ రెడ్డి ఏళ్ళ, కిరన్‌ కుమార్‌ కామిశెట్టి, నవీన్‌ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను హంబర్‌ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా  ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌ ఈద, విజయకుమార్‌ తిరుమలాపురం సాంస్క తిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి.