కాన్సాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాన్సాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

16-10-2018

కాన్సాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికాలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాన్సాస్‌లో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవ్యాలీ నార్త్‌ వెస్ట్‌ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్‌ సింగర్‌ ఫేమ్‌ అంజనా సౌమ్య, కాన్సాస్‌ సిటి స్థానిక సింగర్‌ శ్రియ పొందుర్తిలు తమ గాత్రంతో ఊర్రూతలూగించారు.

నగరంలోని తెలుగు వారు అందరు సాంప్రదాయ వేషధారణలో తాము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్క తిని ప్రతిభింబించే జానపద, బతుకమ్మ పాటలను మహిళలు, యువతులు ఆడిపాడారు. బతుకమ్మలన్నింటిలో ఉత్తమ బతుకమ్మలను న్యాయనిర్ణేతలు నిర్ణయించి వారికి స్పాన్సర్స్‌ ద్వారా బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచారు.