ఘనంగా టీసిఎస్ బతుకమ్మ వేడుకలు

ఘనంగా టీసిఎస్ బతుకమ్మ వేడుకలు

23-10-2018

ఘనంగా టీసిఎస్ బతుకమ్మ వేడుకలు

బే ఏరియాలో బతుకమ్మ వేడుకలను తెలంగాణ సాంస్కృతిక సంఘం (టీసిఎస్‌) ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ సాంస్కతిక సంఘం, భారత ప్రభుత్వ సహకారంతో  ఈ బతుకమ్మ వేడుకలను కాలిఫోర్నియాలోని సిలికాన్‌వ్యాలీ, సాన్‌ రామన్‌, సన్నీవేల్‌లోని ఒర్టెగా పార్క్‌లో  ఘనంగా నిర్వహించింది. బతుకమ్మతోపాటు విజయదశమి వేడుకలను కూడా ఘనంగా జరిపారు. మహిళలంతా కలిసి బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. మత్యుంజయ తాటిపాముల అధ్వర్యంలో గౌరీపూజతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ, దాండియా వీక్షకులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికా లోని ప్రవాస పిల్లలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను ఏటా తెలంగాణ సాంస్కతిక సంఘం నిర్వహిస్తోంది. ప్రవాస తెలుగువారు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.