సీటెల్ లో ఘనంగా దసరా సంబరాలు

సీటెల్ లో ఘనంగా దసరా సంబరాలు

23-10-2018

సీటెల్ లో ఘనంగా దసరా సంబరాలు

వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. సీటెల్‌లోని  బెల్లెవులే హై స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు వేయి మందికిపైగా తెలుగు వారు హాజరయ్యారు. ఆడపడుచులు అందమైన పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ వస్త్ర ధారణలో బతుకమ్మ పాటలు ఆడి పాడారు. ఈ కార్యకమంలో తెలంగాణ సింగర్‌ మధు ప్రియ, బాహుబలి సింగర్‌ సత్య యామిని తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సీటెల్‌ తెలుగు వాళ్లు అతి పెద్ద బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా తీసుకువచ్చారు. ప్రతి ఏడాది సామాజిక సేవ చేసే తెలంగాణ మహిళలకు 'వుమెన్‌ అఫ్‌ ది ఇయర్‌' అవార్డును తెలంగాణ అసోసియేషన్‌ అందించింది. 2018 ఏడాదికి గానూ వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు అరవిందరెడ్డికి సీ2ఎస్‌ ఛైర్మన్‌ జగన్‌ చిట్టిప్రోలు చేతుల మీదుగా ఇచ్చారు. బోర్డు మెంబెర్స్‌  రాజ్‌, సూర్యప్రకాష్‌ రెడ్డి, సంగీతా రెడ్డి, శ్రీధర్‌, రాజా, రామ్‌, సాయి, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి.