టాటా దసరా వేడుకలు సూపర్

టాటా దసరా వేడుకలు సూపర్

30-10-2018

టాటా దసరా వేడుకలు సూపర్

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో గ్రేటర్‌ ఫిలడెల్పియాలో నిర్వహించిన దసరా వేడుకలు కనువిందు చేశాయి. ఫిలడెల్పియా, పెన్సిల్వేనియాలోని చుట్టుపక్కల ఉన్న 800 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దాదాపు 100 మందికిపైగానే కళాకారులు పాల్గొన్నారు. పెన్సిల్వేనియా హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌ వారెన్‌ కంప్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చారు. ఫోనిక్స్‌ విల్లే మేయర్‌ పీటర్‌ జె ఉర్స్‌షెలర్‌ గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా హాజరయ్యారు. టాటా అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డా. పైళ్ల మల్లారెడ్డి, ప్రెసిడెంట్‌ డా. హరనాథ్‌ పొలిచెర్ల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యులు మోహన్‌ పాటలోళ్ళ, విజయ్‌పాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ జంగం, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ మాదాడి, జాయింట్‌ ట్రెజరర్‌ జ్యోతిరెడ్డితోపాటు ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. తమ ప్రాంతంలో ఇండియన్‌ కమ్యూనిటీ ఎదగడం పట్ల ముఖ్య అతిధులు సంతోషం వ్యక్తం చేస్తూ, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

డా. పైళ్ల మల్లారెడ్డి మాట్లాడుతూ, వేడుకలు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఈ ప్రాంత నిర్వాహకులను ఘనంగా అభినందించారు.

డా. హరనాథ్‌ పొలిచెర్ల మాట్లాడుతూ, టాటా బతుకమ్మ, దసరా వేడుకలను అమెరికా నలుమూలలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ ఫిలడెల్పియా టీమ్‌ ఈ వేడుకలను సక్సెస్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు.

బోర్డ్‌ డైరెక్టర్‌ సురేష్‌ వెంకన్నగారి, మీడియా చైర్‌ వంశీ గుళ్ళపల్లి, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ ప్రసాద్‌ కూనరపు, రమణ కొత, భాస్కర్‌ పిన్న, వేణు ఎనుగుల, రీజినల్‌ కో ఆర్డినేటర్స్‌ ప్రణీత్‌ రెడ్డి, శేషి కసిరా, అమర్‌ వేముల, కిరణ్‌ గూడురు, జనార్ధన్‌ బద్దం, సతీష్‌ సుంకనపల్లి, రాజేష్‌ ఆలేటి, స్వామి బొడిగె, వేణు బత్తిని, సుమన్‌ ముదుంబ, స్మిత పెద్దిరెడ్డి, శివారెడ్డి తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు.