తానా మహాసభలకు 23 కోట్ల విరాళాలు

తానా మహాసభలకు 23 కోట్ల విరాళాలు

05-11-2018

తానా మహాసభలకు 23 కోట్ల విరాళాలు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 22వ మహాసభల నిర్వహణకు ప్రవాసీయులు రూ.23 కోట్లు విరాళంగా అందించారు. విరాళాల సేకరణకు తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన ఆధ్వర్యంలో వర్జీనియాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 3.2 మిలియన్‌ డాలర్లు (23 కోట్లు) విరాళంగా సేకరించినట్లు సతీశ్‌ వేమన తెలిపారు. మహాసభల నిర్వహణకు సమన్వయకర్తగా డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు, చైర్మన్‌గా డా.నరేన్‌ కొడాలి. సలహా కమిటీ చైర్మన్‌గా డా.హేమప్రసాద్‌ను నియమించినట్లు వెల్లడించారు.