ఆత్మదర్శనమే విశ్వదర్శనం!

ఆత్మదర్శనమే విశ్వదర్శనం!

05-11-2018

ఆత్మదర్శనమే విశ్వదర్శనం!

ఆత్మ దర్శనం పొందగలిగిన జీవి పరమాత్మని దర్శించగలుగుతుంది. ఆత్మని పరమాత్మని అర్ధం చేసుకున్నవాడే విశ్వదర్శనం పొందగలడు. తనని తాను తెలుసుకున్న వాడు ఆత్మ దర్శనం పొందినవాడు. ఈ సృష్టిలో ప్రతీది అర్ధవంతమైందని నమ్మేవాడే పరాదర్శనం పొందినవాడు. అంటే విశ్వసృష్టిలో పరమాత్మని అంతటా, అన్నిటా చూడగలటం విశ్వదర్శనం. సృష్టి శాశ్వతమన్నది యెంత నిజమో, "నేను" "నాది" అనేది అంత అశాశ్వతం. వాస్తవానికి అవాస్తవికలోనే మనిషి మనుగడ సాగిపోతుంది. మనిషి మహనీయుడు కావాలని అందుకు తనవంతు కృషి చేయాలనుకోవడం చాందసం లేదా పాతకాలం నాటి బూజుపట్టిన భావన. కృషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది అక్షర సత్యం.

తిరువణ్ణామలై శ్రీ రమణ మహర్షిగా గుర్తింపు పొందారు ఈనాటికి ఎందరికో ఆరాధ్యులు అయన సంపాదించిని ఆస్తులకి ఐశ్వర్యాలకి కాదు. ఆయన జీవన విధానం మరియు ధార్మికత. అదే కారణంగా షిర్డీ సాయి బాబా అందరికి ఆరాధ్యనీయుడయ్యాడు. పండుతినే బతికారో, కాయతిని కాలం వెళ్లబుచ్చారో తెలియదు కానీ మానవ శ్రేయస్సుకోసం బతికిన మహనీయులు. భౌతిక సుఖాల గురించి, పేరు ప్రతిష్టల గురించి బ్రతికినవారు కాదు. నమ్మిన సిద్ధాంతాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం కాకుండా మరో ఆలోచన లేని వారు. అందుకే వారు మహనీయులు కాగలిగారు చరిత్రలో చిరంజీవులాగా మిగిలిపోయారు. హిందూ మతం అంటే సనాతన ధర్మం, భారతీయత అంటే పరమత సహనం, జీవ కారుణ్యం అని ప్రపంచ దేశాలకి ఎలుగెత్తి చాటిచెప్పిన దేశం మనది.  పునరుపి జననం పునరుపి మరణం, మృత్యువు తర్వాతి జీవితం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, జీవ హింస, పుణ్య కర్మం-పాప కర్మం, పాపభీతి ఇలా కర్మ సిద్ధాంతం ప్రాచీన భారతంలో సగటు భారతీయున్ని కూడా ఆలోచింప చేసేవి.

నవభారతం కొత్త పుంతలు తొక్కుతోంది.  కాలగతితో పాటు ఎన్నో మార్పులు. సామాన్యుడు మారాడు, అసమాన్యుడు మారాడు. హితం చెప్పేవారు, ధర్మాన్ని భోదించేవారు, ఆచరణలో తామే విఫలులవుతున్నారు. ప్రాపంచిక విషయాలు, శారీరక సుఖాలు, కీర్తి కండూతి ప్రధమ స్థానం, సమాజ శ్రేయస్సు, దైవ చింతన ఆఖరి స్థానంలో ఉంటున్నాయి. ఆధునిక భారతంలో పూజలు మారాయి, గుళ్ళు మారాయి, అర్చకులూ మరారు. అంతట వ్యాపార పోకడలు.

వేదాలను, వేదాంగాలను,ఆగమాలను, పూరణేతిహాసాలను ఔపోసన పట్టిన పండితులు, పరమ పురుషులు, మహా పురుషులు, పరమాచార్యులు, పీఠాదిపతులు కొత్త దారుల్లో నడుస్తున్నారు. వీరు సంవత్సరంలో అధిక భాగం అమెరికా లేదా యూరప్ లేదా మరో దేశంలోనో వుంటారు.

శ్రీశార్వరి ఓభిన్నమైన యోగి. 1950- 60 మధ్య కాలంలో ఓ కథకుడిగా కొన్ని వందల కధలు రచించారు.  ఆ తర్వాత నవలా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రభ దిన పత్రిక మరియు వార పత్రికల సంపాదక వర్గంలో దాదాపు మూడు దశాబ్దాల పైగా పనిచేసిన అనుభవజ్ఞులు.1970 ప్రాంతంలో యోగ ప్రస్థానం ప్రారంభించి దాదాపు వందకు పైగా ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు. కృష్ణావతారం, గీతాపరమార్ధం, యోగం-ధ్యానం ,జిడ్డు కృష్ణమూర్తి, యు జి కృష్ణమూర్తి, అతీత మానసం, శ్రీ దాదా, ధ్యానం ఎలా చేయాలి, ఆత్మా యోగం, సిద్ధార్థ, చాణిక్య, అశోక, కర్ణ మహాభారతం, ఆంద్ర మహా సావిత్రి, నిర్వికల్ప సమాధి, వివేకనందం, భగవాన్ చరణాలు, మృత్యువు తర్వాతి జీవితం, బుద్ధ, స్పందన, యోగాశ్రమ లేఖలు, శంబల, మాస్టర్ సి వి వి జీవిత చరిత్ర, మాస్టర్స్ యోగదర్శిని, షిర్డీ సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, అరవింద, ఆంధ్ర మహాసావిత్రి ఇలా అనేకానేక తెలుగు పుస్తకాలు, Spiritual Journey of Jesus Christ, Christ Consciousness, In Search of a Guru, In Search of God, In Search of Soul, Immortals of Sambala, Love N Yoga, Discovery of Master Yoga, Secrets of Palmistry, Kundalini, Life After Death, Truth is Pathless Path మొదలైన పుస్తకాలుఆంగ్లంలో రచించారు. 

కొన్నివేల మందికి గురువుగా, ఆధ్యాత్మిక నిర్దేశకులుగా, ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంధ కర్తగా, మార్గదర్శకులుగా ఉన్న శ్రీ శార్వరి గారు రిటైర్డ్ సీనియర్ పత్రికా సంపాదకులు. శ్రీ శార్వరి ఆధునిక యోగపుంగవులు. తెల్లని వస్త్రాలు ధరించి, మంచి ముత్యంలా, తెల్లని తామరలా, (పరమ) హంసలా, ఎంతో నిలకడతొను, నిశ్చలత్వంతోను, నిర్మలత్వంతోను వుండే పూజ్యులు శ్రీ శార్వరి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి రచనలు ఆసక్తి ఉన్న వారికీ యోగ సాధన ఎలా చేయాలో నేర్పిస్తాయి."యోగ జీవితంతో మానవుడు మహనీయుడు కావాలి" అన్నది శ్రీ శార్వరి గారి అభిలాష. భృక్త రహిత తారక రాజ యోగం ప్రవచించిన మాస్టర్ సి వి వి గురుకృపతో అంచెలంచెలుగా ఎదిగి పరిపూర్ణ మానవుడిగా ఎందరికో మహిమాన్వితుడిగా పరిణితి చెందిన సిద్ధ పురుషులు శ్రీ శార్వరి. 

యోగాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం: మాస్టర్ శార్వరి జయంతి
విశ్వదర్శనం పుస్తకావిష్కరణ మరియు యోగ సభ్యుల సమావేశం
నవంబర్ 7 ఉదయం 10నుండి సాయంత్రం 4 వరకు 

యోగం పట్ల, ధ్యానం పట్ల ఆసక్తి వున్నవారు, యోగ సాహిత్యాభిలాష వున్నవారు Dr. Vaasili Vasantha Kumar, Direcotr Master Yoga Ashram, 90Krishna Enclave, M.D. Farm Road, Trimugherry, Secunderabad (Telengana) Phone: 011 91 9393933946 or 9393933939 ordrvaasili@yahoo.co.in(mailto:drvaasili@yahoo.co.in)సంప్రదించగలరు.

Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
7062 South Beringer Drive
Cordova, TN 38018

901-387-9646; ramanavvasili@hotmail.comramanavvasili@gmail.com