భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు

భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు

06-11-2018

భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు

ఢిల్లీకి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక మార్కొనీ సొసైటీ అవార్డు దక్కింది. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యతను అంచనా వేసే వినూత్న యాప్‌ను రూపొందించినందుకు గాను వీరిని ఈ అవార్డు వరించింది. భైరవి విద్యాపీఠ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన తన్మయ్‌ శ్రీవాస్తవ, కనిష్క్‌ జీత్‌, ప్రేరణ ఖన్నాల విద్యార్థుల బృందం రూపొందించిన ఈ యాప్‌.. మార్కొనీ సొసైటీ ఆధ్వర్యంలో సెలిస్టిని కార్యక్రమంలో నిర్వహించిన పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ మెళకువలు ఉపయోగించి మెషీన్‌ లర్నింగ్‌ మోడల్‌ వినియోగదారుని ప్రదేశంలో గాలి నాణ్యత స్థితిగతులను అంచనా వేస్తుందని అని తెలిపారు. గూగుల్‌ ప్లే లో టెన్నార్‌ ఫ్లో పేరుతో ఈ యాప్‌ ఉంది. ఢిల్లీ వంటి గాలి కాలుష్య ప్రాంతాల్లో ఈ యాప్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వాడటం చాలా తేలిక, ఉచితం అని మార్కొనీ సొసైటీ పేర్కొంది. ఇందుకు విద్యార్థుల బృందం రూ.1.09 కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.