ఆ ఆంక్షల నుంచి భారత్ కు మినహాయింపు : అమెరికా

ఆ ఆంక్షల నుంచి భారత్ కు మినహాయింపు : అమెరికా

06-11-2018

ఆ ఆంక్షల నుంచి భారత్ కు మినహాయింపు : అమెరికా

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌, చైనా సహా ఎనిమిది దేశాలకు తాత్కాలిక మినహాయింపులను ఇస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌తో ఇంధన లావాదేవీలను గణనీయంగా తగ్గించుకున్నందుకే ఈ ఊరట కల్పిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఇరాన్‌పై అత్యంత కఠినమైన ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మినహాయింపు పొందిన దేశాల జాబితాలో జపాన్‌, ఇటలీ, గ్రీస్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, టర్కి కూడా ఉన్నాయి.