తక్కువ నిద్రతో డీహైడ్రేషన్

తక్కువ నిద్రతో డీహైడ్రేషన్

08-11-2018

తక్కువ నిద్రతో డీహైడ్రేషన్

రోజూ తక్కువ నిద్ర పోయే వారిలో డీహైడ్రేషన్‌ ఇబ్బందులు వస్తాయని తాజా సర్వేలో గుర్తించారు. రాత్రివేళ 8 గంటలకు బదులు 6 గంటలే నిద్రపోయే పెద్దవారిలో ఈ ముప్పు అధికమని పెన్‌స్టేట్‌ నిర్వహించిన అధ్యయనంలో తెలిపారు. ఇలాంటి వారు నీరు కూడా తక్కువ తీసుకుంటారని, అది కూడా ఒక కారణమని పేర్కొన్నారు. స్లీప్‌ అనే జర్నల్‌ ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడే వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ దెబ్బతినడం వల్లే ఇలా జరుగుతుందని వివరించారు.