అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

08-11-2018

అమెరికాలో మరోసారి  కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి గురువారం తెల్లవారుజామున చొరబడిన ఓ వ్యక్తి అక్కడున్న వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఈ ఘనటలో 11 మంది వరకు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బార్‌లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. వంద మందికి పైగా బార్‌లోనే ఉన్నట్లు సమాచారం. పొగ వచ్చే గ్రెనేడ్లను బార్‌లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పుకొచ్చారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు ఘనటా స్థలానికి చేరుకున్నాయి.