దీపావళి పర్వదినం సందర్భంగా ఐక్యరాజ్య సమితి భారత్కు కానుక అందజేసింది. తొలిసారిగా దీపాలతో కూడిన స్టాంపులను విడుదల చేసింది. ఈ విషయాన్ని భారత్లో ఐరాస శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఐరాస స్టాంపుల విభాగానికి ధన్యవాదాలు. చెడుపై మంచి గెలుపునకు గుర్తుగా జరుపుకొనే వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ఐరాస రెండు స్టాంపులను విడుదల చేసింది అని ఆయన ట్వీట్ చేశారు. పండుగ సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని హ్యాపీ దీపావళి అంటూ వెలుగులతో నింపేశారు. ఈ స్టాంపులకు 1.15 డాలరు డినామినేషన్ వర్తిస్తుంది. అంతర్జాతీయ ఎయిర్ మెయిల్ లెటర్స్కు ఇది ప్రారంభ ధర. ఇవి అధికారికంగా గత నెల విడుదలయ్యాయి. ఇప్పుడు ఐరాస ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. ఇవి పది స్టాంపులు, స్టిక్కర్లు, ఐరాస ప్రధాన కార్యాలయం హ్యాపీ దీపావళి అని వెలుగులతో ఉన్న ఫొటోతో షీట్ల మాదిరిగా లభ్యమవుతాయి.