అటార్నీ జనరల్ పై డొనాల్డ్ ట్రంప్ వేటు

అటార్నీ జనరల్ పై డొనాల్డ్ ట్రంప్ వేటు

08-11-2018

అటార్నీ జనరల్  పై  డొనాల్డ్ ట్రంప్ వేటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక అధికారిపై వేటు వేశారు. అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌కు ఉద్వాసన పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తు అంశం గురించి గత కొన్ని నెలలుగా జెఫ్‌ సెషన్స్‌ ట్రంప్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనపై అసంతృప్తిగా ఉన్న ట్రంప్‌ నేడు జెఫ్‌ సెషన్స్‌ను తన పదవి నుంచి తప్పించారు. తాత్కాలిక అటార్నీ జనరల్‌గా ట్రంప్‌కు అత్యంత నమ్మకస్థుడైన మాథ్యూ జీ వైటేకర్‌ను నియమించారు.  నేటి నుంచి ఆయన తన సేవలను అందిస్తారు. ఇంతకాలం పాటు అటార్నీ జనరల్‌గా సేవలందించిన జెఫ్‌ సెషన్స్‌కు ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు.