మధ్యంతర ఎన్నికల్లో సత్తాచాటిన పద్మ

మధ్యంతర ఎన్నికల్లో సత్తాచాటిన పద్మ

09-11-2018

మధ్యంతర ఎన్నికల్లో సత్తాచాటిన పద్మ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్లు మంచి ఫలితాలు సాధించారు. ముఖ్యంగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన ఎన్నికల్లో కొత్తవారు సైతం గెలిచారు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో సంబంధమున్న పద్మ కుప్ప వీరిలో ఒకరు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి అయిన ఈమె మిచిగాన్‌ రాష్ట్రంలో విజయం సాధించారు. 1965 అక్టోబరు 8న భిలాయ్‌లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో పద్మ కుప్ప పుట్టారు.

మైసూరులో కొంతకాలం పెరిగిన పద్మ... నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అమెరికా తూర్పు తీరంలోని స్టోనీబ్రూక్‌, న్యూయార్క్‌ నగరాల్లో పెరిగారు. అనంతరం 15 ఏళ్ల వయసులో తిరిగి భారత్‌ వచ్చి చదువును కొనసాగించారు. వరంగల్‌లోని రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (ఇప్పుడు నిట్‌) నుంచి 1984-85లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. బాల్యం నుంచి పలు ప్రాంతాల్లో తిరగడం వల్ల విభిన్న సంస్కతి, సంప్రదాయాలపై ఆమెకు మంచి అవగాహన ఏర్పడింది. వివాహిత అయిన పద్మకు భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.