హౌస్ లో డెమోక్రాట్ల... సెనేట్ లో రిపబ్లికన్

హౌస్ లో డెమోక్రాట్ల... సెనేట్ లో రిపబ్లికన్

09-11-2018

హౌస్ లో డెమోక్రాట్ల... సెనేట్ లో రిపబ్లికన్

అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో మొత్తం 435 స్థానాలకు అన్నింటికీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 229 సీట్లతో డెమోక్రటిక్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 206 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ పార్టీ, డెమోక్రటిక్‌ పార్టీలు 235-193 బలాబలాన్ని కలిగి ఉండగా ఒక నామినేటెడ్‌ స్థానం, ఆరు ఖాళీ స్థానాలు ఉండేవి. తాజా ఫలితాల్లో ఖాళీ స్థానాలు రిపబ్లికన్‌ పార్టీ ప్రాతినిధ్య స్థానాలను కలుపుకొని మొత్తం 23 సీట్లను డెమోక్రటిక్‌ పార్టీ కొల్లగొట్టింది. మరోవైపు సెనేట్‌ మాత్రం రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కాపాడుకోగలిగారు. 35 స్థానాలకు ఎన్నికలు జరుగగా 26 చోట్ల అధికార రిపబ్లికన్‌ పార్టీ గెలుపొంది. దీంతో 100 మంది సభ్యుల సెనేట్‌లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యుల సంఖ్య 53కు చేరింది. అంతకుముందు 51-49 తేడాతో డెమోక్రటిక్‌ పార్టీపై స్వల్ప ఆధికత్య కలిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రస్తుత ఫలితాలతో 53-47తో సభపై పట్టు పెంచుకోగలిగింది.