ఒకప్పుడు శరణార్థులు...ఇప్పుడు చట్టసభ సభ్యులు

ఒకప్పుడు శరణార్థులు...ఇప్పుడు చట్టసభ సభ్యులు

09-11-2018

ఒకప్పుడు శరణార్థులు...ఇప్పుడు చట్టసభ సభ్యులు

అమెరికా మధ్యంత ఎన్నికల్లో ఇద్దరు ముస్లిం మహిళలు ఇల్హాన్‌ ఒమర్‌, రషీదా తలీబ్‌ (డెమోక్రటిక్‌ పార్టీ తరపున) తొలిసారిగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అమెరికన్‌ పార్లమెంట్‌కు (కాంగ్రెస్‌కు) ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా వారు నిలిచారు. 12 ఏండ్ల వయసులో ఇల్హాన్‌ ఒమర్‌ అమెరికాకు సోమాలియా నుంచి శరణార్థిగా రాగా, రషీదా తలీబ్‌ తండ్రి పాలస్తీనా నుంచి అమెరికా శరణార్థిగా వచ్చారు. తాజా ఎన్నికల్లో ఇల్హాన్‌ ఒమర్‌ మిన్నెసోటా నుంచి, 42 ఏండ్ల రషీదా తలీబ్‌ మిషిగాన్‌ నుంచి గెలుపొందారు.