పెరిగిన డెమోక్రాటిక్ బలం...

పెరిగిన డెమోక్రాటిక్ బలం...

09-11-2018

పెరిగిన డెమోక్రాటిక్ బలం...

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌ దూకుడుకు కళ్ళెం వేసే విధంగా ప్రజలు వ్యవహరించారు. ఉభయ సభల్లో తిరుగులేని మెజారిటీ సాధించాలని భావించిన ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ వలస విధానాలు, పన్ను కోతలు, ఆరోగ్య సంరక్షణ వైఖరిపై మండిపడుతున్న అమెరికన్లు, భారతీయ అమెరికన్లు... ప్రతినిధుల సభ ఎన్నికల్లో ఆగ్రహాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేశారు. దీంతో రెండు సభల్లో వేర్వేరు పార్టీలు ఆధిపత్యం సాధించాయి. ఇకపై కీలక నిర్ణయాలన్నింటిలో అనిశ్చితి తప్పని పరిస్థితి నెలకొననుంది. 

ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల బలం తగ్గింది.  ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉండగా... గురువారం రాత్రి పొద్దుపోయే సమయానికి వచ్చిన ఫలితాల ప్రకారం 225 స్థానాలను రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. అంటే మ్యాజిక్‌ మార్కును ఇప్పటికే దాటేశారు. డెమోక్రాట్లు 197 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు. ఎనిమిదేళ్లుగా రిపబ్లికన్ల చేతుల్లో ఉన్న ప్రతినిధుల సభను ఇప్పుడు డెమొక్రాట్లు సొంతం చేసుకోవడం విశేషం. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ చరిత్రలో తొలిసారి వంద మంది మహిళలు ఎన్నికవడం మరో కీలక పరిణామం.

సెనేట్‌పై ట్రంప్‌ పట్టు

కీలకమైన సెనేట్‌పై ట్రంప్‌ పట్టు నిలుపుకొన్నారు. వంద మంది సభ్యుల సెనేట్‌లో ఇప్పటిదాకా రిపబ్లికన్లకు 51 మంది, డెమోక్రాట్లకు 49 మంది సభ్యులు ఉండేవారు. 97 స్థానాల ఫలితాలు వెలువడగా... రిపబికన్లు 51 చోట్ల నెగ్గారు. ఫ్లోరిడా, మొంతానాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాగా... సెనేట్‌లో డెమోక్రాట్ల బలం 46కు పడిపోయింది. రెండు చోట్ల ఇతరులు గెలుపొందారు. మిసిసిపీలో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. దీంతో ఈ నెల 27న తిరిగి ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిక్యత సాధించడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో వారికి ఇక తిరుగుండదు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఉభయ సభలు జనవరిలో కొలువు తీరనున్నాయి.

గవర్నర్లుగా డెమోక్రాట్ల బలం

గవర్నర్ల రేసులో డెమోక్రాట్లు కాస్త పుంజుకున్నారు. గతంలో ఆ పార్టీ తరఫున 16 మంది గవర్నర్లు మాత్రమే ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 23కు పెరిగింది. ఇక... రిపబ్లికన్‌ గవర్నర్ల సంఖ్య 33 నుంచి 26కు పడిపోయింది.