విరాళాల సేకరణలో 'తానా' రికార్డు

విరాళాల సేకరణలో 'తానా' రికార్డు

09-11-2018

విరాళాల సేకరణలో  'తానా' రికార్డు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్‌ డీసిలో నిర్వహించనున్న 22వ మహాసభల ఏర్పాట్లలో భాగంగా నిర్వహించిన సన్నాహక సదస్సు విజయవంతమైంది. నవంబర్‌ 3వ తేదీన హెర్న్‌డన్‌లోని గ్రాండ్‌ హయత్‌లో నిర్వహించిన ఈ సన్నాహక సదస్సుకు తానా నాయకులంతా పెద్దఎత్తున హాజరయ్యారు. దాదాపు 800 మందికిపైగా హాజరై, తానా మహాసభల నిర్వహణ కోసం పెద్దఎత్తున విరాళాలను కూడా ఈ సమావేశం ద్వారా చాలామంది ప్రకటించారు. దాదాపు 3.2 మిలియన్‌ డాలర్లు (23 కోట్ల రూపాయలు) విరాళంగా వచ్చాయి.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన మాట్లాడుతూ, వచ్చే జూలైలో తానా 22వ మహాసభలను వాషింగ్టన్‌ డీసిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మహాసభలకు మద్దతుగా పెద్దఎత్తున విరాళాలను అందించినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహాసభలు ఉంటాయని, ఇప్పటికే వాషింగ్టన్‌డీసిలోని నాయకులు, వలంటీర్లు ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్నారని కూడా సతీష్‌ వేమన చెప్పారు. మహాసభల నిర్వహణకోసం కన్వీనర్‌గా డాక్టర్‌ మూల్పూరి వెంకటరావును నియమిస్తున్నట్లు చెప్పారు.

డా. నరేన్‌ కొడాలిని చైర్మన్‌గా, సలహా కమిటీ చైర్మన్‌గా డా. హేమప్రసాద్‌ను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, నాదెళ్ళ గంగాధర్‌, జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరితోపాటు లావు అంజయ్య చౌదరి, రవి పొట్లూరి, సాగర్‌ మలిసెట్టి, రవి మందలపాటి, సతీష్‌ వేమూరి, నరేన్‌ కొడాలి, హేమప్రసాద్‌ యడ్ల, సత్యనారాయణ మన్నె, మల్లిఖార్జున్‌ వేమన, కల్పన బోయినపల్లి, లక్ష్మీదేవినేని, రావు యలమంచిలి, విజయ్‌ కొమ్మినేని, సునీల్‌ పాంత్ర, రవి పులి, మురళీ కృష్ణ, సత్య సూరపనేని, సరిత అక్కినేని, ప్రవీణ పాటిబండ్ల, బిందు ఆచంట, నీలిమ చనుమోలు, రాజేంద్ర లోసెట్టి, గోపి కన్నెగంటి, శ్రీధర్‌ చిల్లర, శ్రీనివాస కూకట్ల, రాజశేఖర్‌ బసవరాజు, యుగంధర్‌ ముక్కామల, జో పెద్దిబోయిన, మురళి తాళ్ళూరి, జగదీష్‌ ప్రభల, చలపతి కొండ్రకుంట, రమాకాంత్‌ కోయ, రఘు మేక, ప్రసాద్‌ నల్లూరి, నిరంజన్‌ శృంగవరపు, సాయిసుధ పాలడుగు, రామ్‌ చౌదరి ఉప్పుటూరి, సునీల్‌ వడ్లమూడి, మోహన్‌ వెనిగళ్ళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌ పాల్గొని తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

Click here for Event Gallery

https://photos.app.goo.gl/PMrmb5A99hGgxeBW6