చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు

చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు

09-11-2018

చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు

అమెరికాలోని నెవడాలో జరిగిన ఎన్నికల్లో గత నెల మరణించిన ఓ వ్యక్తి మెజార్టీతో గెలుపొందాడు. 36వ అసెంబ్లీ డిస్ట్రిక్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేసిన వేశ్య గృహాల యజమాని, టీవీ రియాలిటీ షో స్టార్‌ డెన్నిస్‌ హోప్‌(72) విజయం సాధించాడు. అయితే హోప్‌ గత నెల 16నే మరణించాడు. చనిపోయిన కొద్ది రోజుల ముందే ఆయన 72వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నాడు. హోప్‌ మరణించినా ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి లెసియా రామనోపై భారీ ఆధిక్యం లభించింది. నెవడా చట్ట ప్రకారం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి మరణించినా ఓటింగ్‌ జరుగుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తి గెలిస్తే, ఆ పార్టీకి చెందని మరో వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. దీంతో అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని కౌంటీ అధికారులు రిపబ్లికన్‌ పార్టీకి సూచించారు.