అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

09-11-2018

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలోని మిన్నెయాపోలీస్‌ నగరంలో తెలంగాణ వాసి భార్గవ్‌ రెడ్డి ఇత్తిరెడ్డి(25) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటు గురైన భార్గవ్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు అతడి స్నేహితులు తెలిపారు. భార్గవ్‌ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో భార్గవ్‌ ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం టెక్సాస్‌ నుంచి మిన్నెయాపోలీస్‌ నగరానికి ఇటీవల మారాడు. చిన్నవయసులోనే మృతిచెందడం విషాదకరమని తోటీ స్నేహితులు తెలిపారు. ఎప్పుడూ ఇతరులకు సహాయపడే మనస్తత్వం భార్గవ్‌దని స్నేహితులు తెలిపారు. భార్గవ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్‌ రెడ్డి మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.