దీపావళి వేడుకల్లో పాల్గొననున్న డొనాల్డ్ ట్రంప్

దీపావళి వేడుకల్లో పాల్గొననున్న డొనాల్డ్ ట్రంప్

09-11-2018

దీపావళి వేడుకల్లో పాల్గొననున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చేవారం దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. శ్వేత సౌధంలోని తన అధికారిక కార్యాలయంలో (ఓవల్‌ ఆఫీస్‌) మంగళవారం నిర్వహించే వేడుకల్లో ఆయన పాల్గొననున్నట్లు వైట్‌ హౌజ్‌ అధికారులు వెల్లడించారు. పండుగకు ముందురోజు అమెరికాలో దీపావళి జరుపుకొనే భారతీయ అమెరికన్లందరికీ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య ఉన్న స్నేహబంధం ఈ దీపాల పండుగను జరుపుకోవడంతో ప్రతిబింబిస్తుందని వారు అన్నారు. వచ్చే వారం నిర్వహించబోయే దీపావళి వేడుకల్లో ప్రభుత్వంలో వివిధ హోదాలో ఉన్న భారతీయ అమెరికన్లు సహా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.