కనువిందు చేసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

కనువిందు చేసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

12-11-2018

కనువిందు చేసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) నిర్వహించిన దీపావళి వేడుకలు నవంబర్‌ 3వ తేదీన డాలస్‌లోని మార్తోమ చర్చిలో ఘనంగా జరిగాయి. టాంటెక్స్‌ ప్రెసిడెంట్‌ శీలం కష్ణవేణి తమ కార్యవర్గ బందంతో కలిసి ఈ వేడుకలను చక్కగా నిర్వహించారు. ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై, అతిథులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. సాయంత్రం 6 గంటలకు  రుచికరమైన విందుభోజనంతో మొదలై రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగాయి. దీపావళి సాంస్కతిక కార్యక్రమాలు  అమెరికా జాతీయ గీతం, గణేశ స్తుతితోప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నత్యాలు, సినిమా డాన్సులు, 'మహానటి సావిత్రి గారికి నివాళి' కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం నుంచి విచ్చేసిన సినీ గాయకులు పథ్వి చంద్ర, మౌనిమ తమ పాటలతో ప్రేక్షకులను మైమరపింపజేశారు. ప్రముఖ మైమ్‌ కళాకారులు, ఇండియన్‌ మిస్టర్‌ బీన్‌ 'మైమ్‌ కళాధర్‌' తమ ప్రదర్శనలతో  ప్రేక్షకులను నవ్వించారు.

2019లో డాలస్‌లో జరగబోయే నాట్స్‌ కన్వెన్షన్‌లో సహా అతిథ్యం నిర్వహించే అవకాశం ఇచ్చిన నాట్స్‌కి  శీలం కష్ణవేణి కతజ్ఞతలు తెలిపి నాట్స్‌ బందంకు చెందిన బాపు చౌదరి, మాదాల రాజేంద్రను సత్కరించారు. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన టెక్సస్‌ ఇండో అమెరికన్‌ ఫిజీషియన్స్‌ సొసైటీ(టిప్స్‌) అధ్యక్షులు డా. కంచెర్ల కిరణ్‌, కార్యదర్శి  డా.జువ్వాడి శ్రీదేవిని సత్కరించారు. టాంటెక్స్‌ నెలా నెలా తెలుగు  వెన్నెల 11వ వార్షికోత్సవం సందర్ఛంగా నిర్వహించిన స్వీయ కవితల పోటీ విజేతలు సిసియస్‌ రెడ్డి, అందవోలు విద్యాసాగర్‌, ఫోటోకవిత విజేత చిలుకూరి వెంకట శాస్త్రి, నెలా నెలా తెలుగు వెన్నెల సమన్వయకర్త చిన సత్యంను కూడా ఘనంగా సత్కరించారు.

శీలం కష్ణవేణి మాట్లాడుతూ... 20సంవత్సరాలకు పైగా సంస్థకు పోషకులుగా వ్యవహరిస్తూ ఈరోజు రుచికరమైన భోజన ఏర్పాట్లు అందచేసిన పకీరా రెడ్డి  (పసంద్‌/ విందు ఇండియన్‌ రెస్టారెంట్‌)ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన మిగతా పోషకదాతలకు, స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గ బందంకు, నత్యరూపకల్పకులకు ధన్యవాదాలు తెలిపారు. టాంటెక్స్‌ ఎల్లప్పుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందనితెలియజేశారు.

Click here for Event Gallery