ఎన్ ఆర్ ఐ పిల్లలకు పాఠశాల సేవలు అవసరం- మంత్రి గంటా

ఎన్ ఆర్ ఐ పిల్లలకు పాఠశాల సేవలు అవసరం- మంత్రి గంటా

30-11-2018

ఎన్ ఆర్ ఐ పిల్లలకు పాఠశాల సేవలు అవసరం- మంత్రి గంటా

'ఏ దేశం లో వున్నా, ఏ రాష్ట్రం లో వున్నా తెలుగు వారు తమ పిల్లలకు తల్లి భాష తెలుగు నేర్పాల్సిన అవసరం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక్కటే అలాంటి అవసరం గుర్తించి తెలుగు పిల్లలకు 4 సంవత్సరాల తెలుగు కోర్స్ ప్రారంభించిందని, అమెరికా లోని పాఠశాల సంస్థ ఆ తెలుగు కోర్స్ ని విజయవంతం గా నిర్వహిస్తోంది' అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అన్నారు.

నవంబర్ 29న సాయత్రం శ్రీ గంటా శ్రీనివాసరావు ఇంటిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాఠశాల తయారు చేసిన సరికొత్త వెబ్‌సైట్‌ www.paatasala.net ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల వెబ్ సైట్ చాలా సరళంగా, వివరంగా ఉందని, పాఠశాల తెలుగు కమ్యూనిటీ కి మరింత చేరువ అవుతుందని, పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు.

ముందుగా పాఠశాల సీఈఓ శ్రీ సుబ్బారావు చెన్నూరి పాఠశాల ఒక లాభాపేక్ష లేని సంస్థ అని తెలుపుతూ పాఠశాల వెబ్ సైట్ ఫీచర్స్ ని వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ మధుసూదన్ రావు, డైరెక్టర్, APSECRT, శ్రీ వెంకట్ ఈదర, Adviser, Govt of AP కూడా ఉన్నారు.

Click here for Photogallery