అమెరికా టెక్ మొఘల్స్ జాబితాలో భారతీయ మహిళలు

అమెరికా టెక్ మొఘల్స్ జాబితాలో భారతీయ మహిళలు

01-12-2018

అమెరికా టెక్ మొఘల్స్ జాబితాలో భారతీయ మహిళలు

అమెరికాలో టెక్నాలజీ రంగంలో తిరుగులేని ఆధిపత్యంలో ఉన్న 50 మంది మహిళల్లో నలుగురు భారత సంతతి చెందిన మహిళలకు స్థానం లభించింది. ఫోర్బ్స్‌ సంస్థ అమెరికాలోని టాప్‌ 50 ఫిమేల్‌ టెక్నాలజీ మొఘల్స్‌ పేరుతో జాబితాను విడుదల చేసింది. సిస్కో మాజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పద్మశ్రీ వారియర్‌, ఉబర్‌ సీనియర్‌ డైకెక్టర్‌ కోమల్‌ మంగ్తాని, కాన్‌ప్లుయెంట్‌ సహవ్యవస్థాపకురాలు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నేహా నర్ఖడే, డ్రాబ్రిడ్జ్‌ వ్వవస్థాపకురాలు, సీఈఓ కామాక్షి శివరామకృష్ణన్‌ వారిలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలోని 50 మంది అగ్రగామి మహిళలను గుర్తించే జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించడం ఇదే ప్రథమం. మూడు తరాలకు చెందిన టెక్‌ దిగ్గజాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.