అమెరికాలో భారత పాస్ పోర్టు ప్రాజెక్టు

అమెరికాలో భారత పాస్ పోర్టు ప్రాజెక్టు

01-12-2018

అమెరికాలో భారత పాస్ పోర్టు ప్రాజెక్టు

అమెరికాలోని భారతీయులకు పాస్‌పోర్టులు మంజురు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. హూస్టన్‌, అట్లాంటా, చికాగో, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ నగరాల్లో పాస్‌పోర్ట్‌ సేవా ప్రాజెక్టు(పీఎస్‌పీ) చేపట్టింది. అమెరికాలోని భారత కాన్సులేట్‌ లలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని అక్కడే పరిశీలించి, భారత్‌లో ముద్రించి దరఖాస్తుదారులకు ఇచ్చేవారు. ఇందువల్ల 10 రోజుల వరకూ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌పీ వల్ల కాన్సులేట్‌లోనే పరిశీలించి, అక్కడే ముద్రించి దరఖాస్తుదారులకు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు రోజుల్లోనే ముగుస్తుంది.