తేజస్ తయారీలో భారత్ కు సహకరిస్తాం : అమెరికా

తేజస్ తయారీలో భారత్ కు సహకరిస్తాం : అమెరికా

01-12-2018

తేజస్ తయారీలో భారత్ కు సహకరిస్తాం : అమెరికా

దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ తయారీలో భారత్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికాకు చెందిన యుద్ధ విమానాల తయారీ కంపెనీ లాక్‌హీడ్‌ తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఏడాదికి ఎనిమిది తేజస్‌లను తయారు చేస్తోంది. అయితే వీటి సంఖ్యను 18కి పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ నేపథ్యంలో తేజస్‌ తయారీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మార్టిన్‌ ఏరోనాటిక్స్‌, స్ట్రాటజీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వివేక్‌ లాల్‌ తెలిపారు. అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలను విజయవంతం చేయడంలో తమ కంపెనీకి మంచి రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు.