అమెరికా తీరు మారేనా?

అమెరికా తీరు మారేనా?

01-12-2018

అమెరికా తీరు మారేనా?

అమెరికా నిష్పాక్షికంగా వ్యవహరిస్తే తమ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం సాధ్యమేనని చైనా ప్రభుత్వ అధికార పత్రిక చైనా డెలీ తన తాజా సంచిక సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. అర్జెంటీనాలో ప్రారంభమైన జి 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఇరుదేశాలూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలిపింది. చైనా ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందని, అమెరికా కూడా అదే తరహాలో కోరుకుంటున్నట్లు తెలుస్తోందని తెలిపింది. అమెరికా అన్ని విషయాల్లో నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఆ దేశం వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేందుకు, అన్ని విధాలుగా సహకరించేందుకు చైనా సిద్ధంగా వుందని ఈ పత్రిక తెలిపింది.

చైనా ప్రగతికి విఘాతం కలిగించే విధంగా వాణిజ్య ఒప్పందాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటం వంటి ఉద్దేశాలుంటే మాత్రం ఈ ఒప్పందం కుదుర్చుకోవటం సాధ్యం కాదని చైనా డైలీ సృష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఒక వేళ ఒప్పందం కుదిరినా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ప్రతిష్టంభనను పరిష్కరించటం సాధ్యం కాదని ఈ పత్రిక వ్యాఖ్యానించింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో చైనా సాధిస్తున్న ప్రగతిపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, తద్వారా తలెత్తుతున్న ఉద్రిక్తతలను ఈ పత్రిక ప్రస్తావించింది.