కిమ్ తో మళ్లీ భేటీ అవుతా

కిమ్ తో మళ్లీ భేటీ అవుతా

03-12-2018

కిమ్ తో మళ్లీ భేటీ అవుతా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌తో తాను మరోసారి భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. జి20 సదస్సులో పాల్గొన్న ట్రంప్‌ తిరిగి పనయమవుతూ విమానాశ్రయంలో మీడియతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ సమావేశం అవుతామన్నారు. కిమ్‌తో సానుకూల వాతావరణం ఉందని, సత్సంబంధాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే తాను కిమ్‌ను అమెరికా ఆహ్వానించే అవకాశం ఉందని ట్రంప్‌ తెలిపారు. వీరిద్దరి మధ్య గతంలో మాటల తూటాలు పేలి, అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధ భయం కమ్ముకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరు సింగపూర్‌లో భేటీ అయి చర్చించారు. దీంతో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొంది.