బాబు టూర్ ఏర్పాట్లపై బే ఏరియాలో సమావేశం

బాబు టూర్ ఏర్పాట్లపై బే ఏరియాలో సమావేశం

30-04-2017

బాబు టూర్ ఏర్పాట్లపై బే ఏరియాలో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలిఫోర్నియా పర్యటనపై ఎన్నారైటీడిపి, ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ రెస్టారెంట్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మే 4న ముఖ్యమంత్రి శాన్‌హోసె వస్తున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి స్వాగత ఏర్పాట్లు, రిసెప్షన్‌ వంటి ఇతర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు, టీడిపి అభిమానులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి ప్రచారాన్ని ఎపి జన్మభూమి, ఎన్నారై టీడిపి నాయకులు విస్తృతంగా చేయడం ప్రారంభించారు. ఎన్నారై టీడిపి నాయకుడు వెంకట్‌ కోగంటి, పైలా ప్రసాద్‌, విజయ ఆసూరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శాన్‌హెసెలో జరిగే కమ్యూనిటీ రిసెప్షన్‌లో పాల్గొనాలనుకునేవాళ్ళు ఈ కింది లింక్‌ ద్వారా తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాల్సిందిగా ఎన్నారై టీడిపి నాయకులు కోరారు.

http://www.apjanmabhoomi.org/

 

Click here for Photogallery