శాంతి చర్చలకు సహకరించండి : పాక్ ను కోరిన ట్రంప్

శాంతి చర్చలకు సహకరించండి : పాక్ ను కోరిన ట్రంప్

04-12-2018

శాంతి చర్చలకు సహకరించండి :  పాక్ ను కోరిన ట్రంప్

అప్ఘనిస్థాన్‌లో శాంతి చర్చలకు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్థాన్‌ను కోరారు. అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని దక్షిణాసియా దేశాల సమచార మంత్రి ఫవాద్‌ చౌదరీ తెలిపారు. ఉగ్రసంస్థలు, తాలిబన్ల ఆగడాలతో ఆఫ్ఘాన్‌ పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయారు. తాలిబన్లతో చర్చలు జరపాలంటే పాక్‌ సహకారం కచ్చితంగా అవసరం అని ట్రంప్‌ పంపిన ఉత్తరంలో ఉందని ఫవాద్‌ తెలిపారు. అయితే, ఉగ్రసంస్థల నిర్మూలనలో తమకు పాక్‌ సహకరించలేదని, అందుకే ఆదేశానికి ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా తాజాగా అఫ్ఘాన్‌ విషయంలో ఇమ్రాన్‌ సర్కార్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. తాలిబన్లతో అమెరికా ఓ దఫా ఇప్పటికే చర్చలు జరిపింది. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు ఆఫ్ఘాన్‌ అధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘనీ కూడా ప్రయత్నిస్తున్నారు.