అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం : కమలా హారిస్

అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం : కమలా హారిస్

04-12-2018

అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం : కమలా హారిస్

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలా వద్దా అనే విషయమై రానున్న సెలవుల్లో నిర్ణయిస్తామని మొట్టమొదటి భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్‌ కమలా హారిస్‌ తెలిపారు. తాను తీసుకునే నిర్ణయమేదైనా కుటుంబంతో చర్చించే తీసుకుంటానని చెప్పారు. కాలిఫోర్నియాలోని ఓక్లహాండ్‌లో జన్మించిన ఆమె తల్లి భారతీయురాలు, 1960లో చెన్నై నుండి అమెరికా వలస వచ్చేశారు. తండ్రి జమైకన్‌ అమెరికన్‌. తల్లి శ్యామలా గోపాలన్‌ సైన్స్‌ పట్టభద్రురాలు కాగా తండ్రి అమెరికాలో ఆర్థిక శాస్త్రంలో అధ్యయనం చేశారు. ఒబామాకు సన్నిహితంగా ఉండే కమలా హారిస్‌ను మహిళ ఒబామాగా పిలిచేశారు. ట్రంప్‌ తిరిగి పోటీ చేస్తే ఆయను ఎదుర్కొనగలిగే సత్తా వున్న అభ్యర్థిగా హారిస్‌కు ప్రాధాన్యత ఉంది.