భారత్, అమెరికాల బంధం మరింత బలోపేతం

భారత్, అమెరికాల బంధం మరింత బలోపేతం

05-12-2018

భారత్, అమెరికాల బంధం మరింత బలోపేతం

రక్షణ, భద్రత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్‌, అమెరికాలు అంగీకరించాయి. వాషింగ్టన్‌లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మేటిస్‌తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో మూలస్థంభమైన రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు సమీక్ష జరిపారు. ఇండో-పసిఫిక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి భారత్‌ కృషి చేస్తోందని మేటిస్‌ కొనియాడారు. రక్షణ భాగస్వామ్యంలో భారత్‌, అమెరికా మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతోందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రక్షణలో అమెరికాను భారత్‌ ముఖ్యమైన భాగస్వామిగా చూస్తోందని అన్నారు.