కాస్మెటిక్స్ తో త్వరగా యుక్త వయసు

కాస్మెటిక్స్ తో త్వరగా యుక్త వయసు

05-12-2018

కాస్మెటిక్స్ తో త్వరగా యుక్త వయసు

రసాయనాలు కలిగిన కాస్మెటిక్స్‌, సబ్బులు, టూత్‌పేస్ట్‌లు వాడటం వల్ల బాలికలు త్వరగా యుక్త వయసుకు వస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. యనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. కొంత మంది పిల్లల తల్లుల్లో డైథైల్‌ ఫాలలేట్‌, ట్రిక్లోసెన్‌ శాతం శరీరంలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిగిన కాస్మెటిక్స్‌ను చర్మానికి పూసుకొన్నా, ముక్కుతో పీల్చినా అవి శరీరం లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు.